Credit Card అంటే ఈరోజుల్లో తెలియని వారు ఎవరు లేరు. ఈ Credit Card వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అలానే నష్టాలు కూడా ఉన్నాయి. మనము క్రెడిట్ కార్డు పొందాలి అంటే బ్యాంకుకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే, బ్యాంకు వారు మీ యొక్క ఆధారాలు తీసుకొని మన సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ఆధారం చేసుకొని మనకు పోస్ట్ ద్వారా క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది.
Big Update on Credit Card:
మీరు మీ క్రెడిట్ కార్డు తో మీ ఇంటి అద్దె, కరెంటు బిల్లు,గ్యాస్ బిల్లు, కేబుల్ బిల్లు మరియు Wifi బిల్లు కడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఇలాంటి యుటిలిటీ బిల్స్ పైన లిమిట్స్ పెట్టేశాయి. మనము ముందు లాగ మన యొక్క బిల్స్ కడితే రివార్డ్స్ పాయింట్స్ కూడా రావడం జరగదు.
What is the New Rule for Credit Card?
మనము మన Credit Card ద్వారా మన నెలవారీ Utility బిల్స్ చెల్లింపులపై Banks అదనపు చార్జీలు విధిస్తున్నాయి. ఇటీవలే వచ్చిన సమాచారం ప్రకారం Yes Bank మరియు IDFC Bank మే 1, 2024 (1st May 2024) నుండి తమ క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే ప్రతి యుటిలిటీ చెల్లింపులపై అదనంగా 1% రుసుమును (Interest) వసూలు చేస్తామని ప్రకటించాయి. ఈ లిమిట్స్ ఒక్కో Bank ఒక్కో Limit ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది
అయితే ఈ బ్యాంకులు ఎంత వరకు లిమిట్ పెట్టారు?
Yes Bank క్రెడిట్ కార్డ్ ఎవరు వాడుతున్నారో తన బిల్లు స్టేట్‌మెంట్ సైకిల్లో రూ. 15,000 కంటే తక్కువ యుటిలిటీ (Utility) బిల్లును చెల్లిస్తే, వారికి ఎటువంటి అదనపు రుసుము కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఒక స్టేట్‌మెంట్ సైకిల్లో రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ (Utility) బిల్లులను చెల్లిస్తే, వారికి అదనంగా 1% రుసుము(Interest) మరియు దానిపై 18% GST విధించబడుతుంది.
IDFC Bank క్రెడిట్ కార్డ్ ఎవరు వాడుతున్నారో తన బిల్లు స్టేట్‌మెంట్ సైకిల్లో రూ. 20,000 కంటే తక్కువ యుటిలిటీ (Utility) బిల్లును చెల్లిస్తే, వారికి ఎటువంటి అదనపు రుసుము కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఒక స్టేట్‌మెంట్ సైకిల్లో రూ. 20,000 కంటే ఎక్కువ యుటిలిటీ (Utility) బిల్లులను చెల్లిస్తే, వారికి అదనంగా 1% రుసుము(Interest) మరియు దానిపై 18% GST విధించబడుతుంది.
Note:
ప్రస్తుతానికి అయితే ఎస్ బ్యాంకు మరియు ఇద్ఫ్సీ బ్యాంక్స్ మాత్రమే 15,000/- మరియు 20,000/- లిమిట్ పెట్టి 1% అదనం గా వసూలు చేసేతున్నారు కానీ ఇంకా మిగతా బ్యాంకులు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క విషయం పై ఎటువంటి అప్డేట్ అనేది ఇంకా రాలేదు.
ఎటువంటి అప్డేట్ వచ్చిన కత్చితంగా మీకు నా తరువాత బ్లాగ్ లో అందిస్తాను. ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చిన ఈ సబ్జెక్టు మీకు ఉపయోగపడితే కత్చితంగా ఫాలో చేయండి.
Next Blog Information:
అసలు మనకి ఈ క్రెడిట్ కార్డు రావడానికి గల ముఖ్యమైన కారణం CIBIL Score (or) Credit Score అని ముందు చెప్పడం జరిగింది అయితే నేను మీకు న తరువాతి బ్లాగ్ ల సిబిల్ స్కోర్ యొక్క పూర్తి సమాచారం మీకు ఇవ్వబోతున్నాను.


.jpg)
Comments
Post a Comment